Bangalore Air Show: బెంగళూరు ఆకాశం ఇప్పుడు మిరుమిట్లు గొలుపుతోంది. ఏరో ఇండియా-2025కు సిలికాన్ సిటీ బెంగళూరులో జరుగుతోంది. ప్రపంచదేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక ఎయిర్ షో… మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొంటున్నారు.
అత్యాధునిక యుద్ధ విమానాల ప్రదర్శన
‘ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’ అనే థీమ్‌తో ఎయిర్ షో జరుగుతోంది. అప్‌డేటెడ్ టెక్నాలజీతో రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్-35 లైట్నింగ్ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు తమ ఏరో టెక్నాలజీని ఆవిష్కరించారు. కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్ షోలు జరగ్గా… ఇది 15వ ఎయిర్‌షో. అలాగే ప్రతీసారి బెంగళూరే ఎయిర్‌షోకి అతిథ్యమిస్తూ వస్తోంది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది కేంద్రం.
Also Read: ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు – హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !
ప్రపంచ దేశాల సామర్థ్యంతో పోటీ పడేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత రక్షణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్, ఏఎంసీఏ మాదిరి యుద్ధ విమానాలు కీలకం. వైమానిక దళానికి కొత్తతరం తేజాస్ ఎంకే1ఏను రెండేళ్ల ఆలస్యంగా అందించినా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 24 తేజస్‌లను అప్పగించడానికి హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్‌షోలో 27 దేశాల రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, 15 దేశాల రక్షణ, సేవా రంగాలు అధినేతలు, 12 దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల సామర్థ్యం 1 లక్షా 60వేల కోట్లకు , ఎగుమతులను 30వేల కోట్లకు పెంచాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.
ప్రైవేటు రక్షణ తయారీ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన
హెచ్‌ఏఎల్, బోయింగ్, ఎయిర్‌బస్, ఇస్రో, ఎన్‌ఏఎల్, రోల్స్ రాయిస్, ఎయిర్ ఇండియా, జీఈ ఏరోస్పేస్, మహీంద్ర ఏరోస్పేస్ తదితర సంస్థలకు చెంిన ఆధునిక ఉత్పత్తులు ఈ ప్రదర్శలో ఆకర్షణగా నిలువనున్నాయి. 150 విదేశీ సంస్థలు సహా 900కిపైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. రెండేళ్ల కిందట 2023లో జరిగిన వైమానిక ప్రదర్శనలో 809 సంస్థలు సహా వ్యాపారవేత్తలు పాల్గొనగా.. 7 లక్షల మందికిపైగా సందర్శకులు ప్రదర్శను తిలకించారు. ప్రదర్శనలో మొదటి మూడు రోజులు వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. చివరి రెండు రోజులు సాధారణ ప్రజల్ని అనుమతిస్తారు.
Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో – అక్కడో ఘోరం జరిగిపోయింది – ఇప్పుడిదే వైరల్ వీడియో
మరిన్ని చూడండి