World Second Largest Diamond Market India: భారతదేశం చైనాను అధిగమించి రెండవ అతిపెద్ద వజ్రాల మార్కెట్‌గా అవతరించింది. చైనా వజ్రాలకు డిమాండ్ తగ్గిపోయింది. బారత్ వజ్రాల మార్కెట్ లో రెండంకెల వృద్ధిరేటును నమోదు చేస్తోంది. చైనాలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన కారణంగా అక్కడ వజ్రాలకు డిమాండ్ తగ్గింది. అదే సమయంలో చైనా వజ్రాలపై ప్రపంచం మార్కెట్ లో అంత నమ్మకం లేదు. ఈ కారణంగా మరింత డిమాండ్ పెరిగింది. మరో వైపు భారత్ కు చెందిన వజ్రాల వ్యాపారులు అద్భుతమైన పనితీరు, వ్యాపార మెలకువలు పాటిస్తూ ప్రపంచ మార్కెట్ లో తమ వాటాను అంతకంతక పెంచుకుంటున్నారు.ఇప్పటివరకూ చైనా రెండో స్థానంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది. స్థిరమైన వృద్ధితో భారత్ మొదటి స్థానానికి వచ్చింది.
ప్రపంచ డైమండ్ మార్కెట్ లోరెండు రకాల వజ్రాలు ఉంటాయి. ఒకటి ల్యాబుల్లో తయారు చేసే వజ్రాలు..రెండు సహజమైన వజ్రాలు. అమెరికా మార్కెట్ లో సహజమైన వజ్రాలకు డిమాండ్ ఉంటుంది. చైనా ఎక్కువగా ల్యాబ్ ల్లో తయారు చేసిన డిమాండ్లను మార్కెట్ చేస్తుంది. బారత్ కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ను రెడీ చేస్తుంది. సహజమైన వజ్రాలకు భారత్ ప్రసిద్ధి. అమెరికా మార్కెట్ లో భారత వజ్రాలు ఇటీవలి కాలంలో అత్యధికంగా ఆదరణ పొందుతున్నాయి. చైనా వజ్రాలకు ఆదరణ తగ్గిపోతోంది. చైనాలో ఓ మైక్రోవేవ్ లో మూడు వారాల్లో ల్యాబ్ డైమండ్స్ తయారు చేస్తున్నారు. కానీ అసలైన వజ్రాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉండేవి. సహజంగా లభించేవి.
భారత డైమాండ్ మార్కెట్ .. వ్యాపారాలు ఇదే వ్యాపార సూత్రాలను .. అద్భుతమైన వజ్రాలను ప్రపంచానికి అందించడం ప్రారంభిస్తే .. ప్రపంచ మార్కెట్ లో భారత్ స్థానం చాలా ఉన్నతంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ డైమండ్ మార్కెటింగ్ కంపెనీలు.. సహజమైన వజ్రాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వాటినే ప్రమోట్ చేస్తున్నాయి. ఇది భారత్ కు అనుకూల అంశం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓ వైపు చైనాలో ఆర్థిక మాంద్యం కారణంగా లగ్జరీ వస్తువులకు.. ముఖ్యంగా వజ్రాలకు డిమాండ్ తగ్గిపోతోంది. ఇది భారత్ కు మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది.
భారత్ లో ఇటీవలి కాలంలో నగల్లో డైమండ్ నగలకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపుగా ప్రతి జ్యూయలరీ స్టోర్ డైమండ్స్ కు ప్రత్యేక బ్రాండ్ ను లాంచ్ చేసాయి. ఇప్పుడు బంగారంతో పోటీగా డైమజడ్స్ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. లోకల్ మార్కెట్ కూడా అభివృద్ది చెందిన ప్రపంచ డైమండ్ మార్కెట్ లో భారత్ తొలి స్థానంలో నిలవడం ఖాయమని అనుకోవచ్చు. చైనా అనేక రకాల పద్దతులతో ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు వజ్రాల నుంచి ప్రారంభించి భారత్ అన్ని రంగాల్లో చైనాను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
Also Read: Donald Trump : ట్రంప్ టారిఫ్‌ల మోత,- ఆ 3 దేశాలకు షాకిచ్చిన అమెరికా – సుంకాలపై కీలక నిర్ణయం
మరిన్ని చూడండి