what is the symbol of indian constitution Who wrote this in hindi and english in telugu

75th Constitution Day Celebrations: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 1950లో జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1930లో జనవరి 26న భారత దేశానికి స్వాతంత్రం కావాలంటూ భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ తీర్మానం చేసి బ్రిటీష్‌ పాలకులకు పంపించారు. అందుకే ఆరోజుకు గుర్తుగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 

అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 2015 నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగానే జరుపుకునేవాళ్లం తర్వాత  2015 నుంచి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలు చేసుకుంటున్నాం.

Also Read: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ? 

భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. జవహర్‌లాల్‌ నెహ్రూ అంగీకారంతో ఇటాలిక్‌ చేతిరాతలో నిపుణుడైన ప్రేమ్‌ బెహారి నారాయణ్‌ రాయ్‌జాదా రాశారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీని తన దస్తూరీతో రాశారు. ప్రతి పేజీ చివరలో తన పేరు తన తాతా రామ్‌ ప్రసాద్‌ సక్సేనా పేరు మాత్రం రాసుకున్నారు. సుదీర్ఘ కాలం ఉండే పార్చ్‌మెంట్‌ షీట్లపై 6 నెలల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రాశారు. దీని ప్రతులు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో ఉన్నాయి. హిందీలో మాత్రం వసంత్‌ కృష్ణ వైద్య రాశారు. 

భారత రాజ్యాంగం రాయడానికి అయిన మొత్తం ఖర్చు రూ.64 లక్షలు. భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీని పార్లమెంట్ లైబ్రరీలో హీలియం నింపిన ఓ పెట్టెలో, నాఫ్తలీన్ బాల్స్‌తో ఫ్లాన్నెల్ గుడ్డలో చుట్టి జాగ్రత్తగా భద్రపరిచారు.

రాజ్యాంగం దానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు ఇక్కడ చదువుకోవచ్చు. 

1. మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు?  పి.వి. నరసింహారావు 
2. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ప్రాథమిక హక్కులఉప కమిటీ చైర్మన్ ఎవరు?  జె.బి. కృపలానీ
3. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?  ఏనుగు 
4. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?  దాదాభాయ్ నౌరోజి
5. ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది?  రష్యా 
6. ప్రవేశిక భారత రాజ్యాంగానికి జాతక చక్రం వంటిది అని అన్నది ఎవరు?  డా. కె .ఎమ్. మున్షీ 
7. సుప్రీం కోర్టు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది?  124 
8. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షదీవులు హైకోర్టు ఎక్కడ కలదు?  ఎర్నాకుళం( కేరళ)
9. భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికలను రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మగా భావించబడింది? ఆర్టికల్ 32 
10. సతీ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?  1829 
11. వార్తాపత్రికలను ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించినది ఎవరు?  ఎడ్మండ్ బర్గ్.
12. అణు క్షిపణి పితామహుడుగా బిరుదు కలిగిన ఎ. పి.జె. అబ్దుల్ కలామ్ ఆత్మకథ పేరు?  వింగ్స్ ఆఫ్ ఫైర్ 
13. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే వారు ఎవరు? లోక్ సభ స్పీకర్ 
14. ఎన్నికల సంస్కరణలకై దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు? వి.పి.సింగ్ 
15. అతి తక్కువ కాలం పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజపేయి (13 రోజులు)

Also Read: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

మరిన్ని చూడండి

Source link