Who is Mohini Mohan Dutta Rs 500 crore surprise in Ratan Tata will: దేశంలో దిగ్గజ పారిశ్రామిక వేత్తగా టాటా గ్రూపును శాఖోపశాఖలుగా విస్తరించిన గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా గత ఏడాది చనిపోయారు. ఆయన పెళ్లి చేసుకోలేదు.తన జీవితాన్ని పూర్తిగా టాటా గ్రూపుకే అంకితం చేశారు.ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీలునామాలోఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఆయన మిత్రుడిగా పేరు తెచ్చుకున్న శంతనుకూ.. విద్య కోసం అయిన అప్పులు చెల్లించడమే కాకుండా టాటా గ్రూపులో మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఇప్పుడు మోహిని మోహన్ దత్తా అనే వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని కేటాయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి ఈ హాట్ టాపిక్ అయింది.అసలు ఎవరు ఈ మోహిని మోహన్ దత్తా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు.
రతన్ టాటా కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో కలసి పని చేసిన మోహని మోహన్ దత్తా
రతన్ టాటా తన వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ గోప్యత పాటిస్తారు. అందుకే ఆయనపై ఎప్పుడూ వ్యాపార పరమైన అంశాలు తప్ప ఇతర విషయాల్లో రూమర్స్ రావు. అందుకే ఈ మోహిని మోహన్ దత్తా ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. ఈయన రతన్ టాటాకు మిత్రుడని కూడా ఎప్పుడూ పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ రతన్ చాటా .. తన వ్యాపార పయనం ప్రారంభించిన కొత్తలో మోహిని మోహన్ దత్తాతో కలిసి పని చేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. మోహిని మోహన్ దత్తా కూడా మొదట టాటా గ్రూపులో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. తర్వాత సొంతంగా ట్రావెల్ ఎజెన్సీని పెట్టారు .
Also Read: ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు – హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !
ట్రావెల్స్ ఎజెన్సీ సక్సెస్ కావడంతో ఆ సంస్థను టాటా హోటల్ గ్రూపు విభాగమైన తాజ్ గ్రూపు విలీనం చేసుకుంది. తర్వాత థామస్ కుక్ ఇండియా గ్రూపనకు అమ్మేసింది. అయితే ఆ సమయంలో టాటా షేర్ హోల్డర్ గా మారిన మోహిన్ మోహన్ దత్తా.. టాటా క్యాపిటల్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాటా క్యాపిటల్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. రతన్ టాటాతో తన అనుబంధం.. ఆయనకు ఇరవై నాలుగు ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఉందని మోహని మోహన్ దత్తా గుర్తు చేసుకున్నారు. గుజరాత్ కు చెందిన ఆయన ఇప్పటికీ టాటా గ్రూపులో విధులు నిర్వహిస్తున్నారు.
మోహిని మోహన్ దత్తా కుమార్తె కూడా టాటా గ్రూపులో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆమె పని తీరు కూడా రతన్ టాటాను ఎంతో ఆకట్టుకుంది. ఆమెకు మంచి భవిష్యత్ ఉందని చెప్పేవారని అంటున్నారు.
Also Read: సునామీ వచ్చినప్పుడు కాపాడారు – 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు – మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
మరిన్ని చూడండి