RBI New Deputy Governor Poonam Gupta Salary: కేంద్ర ప్రభుత్వం బుధవారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్ పూనం గుప్తాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. ఆమె ఎం.డి. పాత్ర స్థానంలో విధులు నిర్వహిస్తారు. జనవరిలో ఆయన తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు పూనం గుప్తా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. క్యాబినెట్ నియామక కమిటీ (ACC) ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
పూనం గుప్తా కెరీర్
పూనం గుప్తా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఆమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. ఆమె తన కెరీర్‌ను బోధనతో ప్రారంభించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ISI ఢిల్లీ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో పాఠాలు బోధించారు. అనంతరం ఆమె IMF, వరల్డ్ బ్యాంక్‌తో అనుసంధానమై, దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు. 2021 నుంచి ఆమె NCAER డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
ప్రధాన విజయాలు
పూనం గుప్తా ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల మండలి, 16వ ఆర్థిక సంఘం సలహా కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. G20కి భారతదేశం అధ్యక్షత వహించినప్పుడు మాక్రో ఎకనామిక్స్, వాణిజ్యంపై టాస్క్ ఫోర్స్ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. 1998లో ఆమెకు అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంపై చేసిన పిహెచ్‌డికి EXIM బ్యాంక్ అవార్డు లభించింది.
RBIకి ఎందుకు ఎంపిక చేశారు?
RBIకి పూనం గుప్తా ఎంపిక చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పూనం గుప్తాకు మాక్రో ఎకనామిక్స్, సెంట్రల్ బ్యాంకింగ్, ఆర్థిక స్థిరత్వం రంగాల్లో ఎక్కువ అనుభవం ఉంది. ఆమె అనుభవం RBI దేశ ఆర్థిక విధానాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న ఈ కాలంలో ఆమె అనుభవం RBIకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పూనం గుప్తా జీతం, సౌకర్యాల సంగతేంటీ?
RBI కొత్త డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తాకు ప్రతి నెలా దాదాపు 2,25,000 జీతం లభిస్తుంది. అంతేకాకుండా, డిప్యూటీ గవర్నర్‌కు అనేక రకాల అలవెన్స్‌లు లభిస్తాయి, వీటిలో డీఏ, గ్రేడ్ అలవెన్స్, విద్య అలవెన్స్, గృహ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, వైద్య అలవెన్స్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా ఈ పదవుల్లో నియమితులకు ఇంధన అలవెన్స్, ఫర్నిచర్ అలవెన్స్, సోడెక్సో కూపన్లు వంటి ఇతర సౌకర్యాలు లభిస్తాయి. RBI డిప్యూటీ గవర్నర్‌కు ఒక మంచి పెద్ద ఇల్లు ఉంటుంది.
మరిన్ని చూడండి