Why Is RBI Taking Some Rs 5 Coins Out Of Circulation: ఐదు రూపాయల కాయిన్ అంటే ఈ తరం వారికి ఓ ఎమోషన్. ఎందుకంటే ఆ ఐదు రూపాయలతో చాలా చాలా చిన్న చిన్న కోరికలు తీర్చుకుని ఎదిగి వచ్చిన తరం అది. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత కాయిన్స్ చలామణి పూర్తిగా తగ్గిపోయింది.దీంతో ఆ కాయిన్స్ ను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కారణంగా ఓ రూపులో ఉండే ఐదు రూపాయల కాయిన్స్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.
లావుగా ఉండే రూ. 5 కాయిన్స్ మింటింగ్ నిలిపివేత
ప్రస్తుతం రూపాయి నుంచి ఇరవై రూపాయల వరకూ ఉన్న నాణెలను మింట్ చేస్తున్నారు. చెలామణిలోకి తెస్తున్నారు. పది రూపాయల కాయిన్స్ చెల్లవన్న ఓ ప్రచారం విస్తృతంగా ఉడటంతో ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఎవరూ వినిపించుకోవడం లేదు. అందుకే ఎవరూ వాటిని తీసుకోవడం లేదు. తాజాగా ఓ రకమైన ఐదు రూపాయల కాయిన్స్ ను మింట్ చేయడం ఆర్బీఐ నిలిపివేసింది. అలాగే వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ఐదు రూపాయల కాయిన్స్ లో కొన్నాళ్ల క్రితం వరకూ చాలా లావుగా ఉండే కాయిన్స్ ను మింట్ చేసేవారు. కాస్త బరువుగా కూడా ఉండేది. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో వీటిని విస్తృతంగా చెలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారింది.
Also Read: 15 రోల్స్ రాయిస్ కార్లను కొనేశారు – తల పాగాకు మ్యాచ్ అయ్యే కార్లోనే వెళతారు – సింగ్ ఈజ్ కింగ్ అని ఊరకనే అంటారా ?
ఆ కాయిన్స్ తో బ్లేడ్ల ఉత్పత్తి
ఐదు రూపాయల కాయిన్ ను మింట్ చేయడానికి ఐదు రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అత్యంత క్వాలిటీ ముడిపదార్థం వాడతారు. ఈ ఐదు రూపాయల కాయిన్స్ ను సేకరిస్తున్న కొంత మంది కరగబెట్టి బ్లేడ్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఒక్క ఐదు రూపాయల కాయిన్ తో మూడు , నాలుగు బ్లేడ్లు తయారు చేసే అవకాశం ఉండటంతో భారీగా లాభాలు వస్తున్నాయి. దీంతో ఆలాంటి కాయిన్స్ ను సేకరించి బ్లేడ్లుతయారు చేస్తున్నారు. ఈ అంశం ఆర్బీఐ దృష్టికి వెల్లింది. సహజంగా కరెన్సీ విషయంలో ఇలా చేయడం నేరం. అందుకే బ్లేడ్లు తయారు చేసే వారి చేతుల్లో లావుగా ఉండే కాయిన్స్ వెళ్లకుండా.. తామే ఉపసంహరించుకోవాలని భావిస్తోంది.
Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్ – తేవాలని టెకీ సలహా – సిద్దమన్న ఎలాన్ మస్క్ !
నాణెలను కరిగించి సొమ్ము చేసుకునే బిజినెస్ పెద్దదే
నిజానికి నాణెల విలువకు.. వాటిని తయారుచేసే విలువకు పొంతన ఉండదు. రూపాయి కాయిన్ తయారు చేయడానికి నాలుగైదు రూపాయల విలువైన నికెల్ వాడతారని చెబుతారు. ఇలా చాలా కాయిన్స్ వాటికి ఉన్న విలువ కన్నా ఖరీదైన లోహంతో ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది కరగబెట్టి వ్యాపారాలు చేస్తూంటారు. అందుకే ఆర్బీఐ కఠిన చట్టలు తీసుకు వచ్చింది. ఇప్పుడు బ్లేడ్ల తయారీ దారులు ఆ పని చేస్తూండటంతో చాలా కాలం క్రితమే వాటి ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఉపసంహరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని చూడండి