Why Modi Went To Lakshadweep: ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) లక్షద్వీప్ (Lakshadweep)లో రెండు రోజుల పాటు పర్యటించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేశారు. ప్రధాని మోడీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల అధికారిక పర్యటనలో ఎక్కువ సమయం…లక్ష్యదీప్ ప్రకృతి అందాలను ప్రపంచానికి తెలియజేయడానికి తహతహలాడారు. స్విమ్మింగ్ చేయడం, సముద్రంలో నీటి అలల అంచున కుర్చీ వేసుకొని కూర్చుకోవడం…నడుచుకొని వెళ్లడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లక్షద్వీప్ సౌందర్యం, ప్రజలు చూపించిన తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న లక్ష్యద్వీప్ దీవులు…పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయని రాసుకొచ్చారు. అక్కడితో ఆగని మోడీ…పర్యాటకలకు సలహా కూడా ఇచ్చారు. సాహాసాలు చేయలనుకునే వారంతా… లక్ష్యద్వీప్ ను జాబితాలో పెట్టుకోవాలంటూ సలహా కూడా ఇచ్చారు.
మాల్దీవులుకు చెక్ పెట్టడమే లక్ష్యం
మోడీ లక్ష్యద్వీప్ పర్యటనక వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది దేశంలో పర్యాటకాన్ని పెంచడం…మాల్దీవులు పర్యాటక రంగానికి చెక్ పెట్టడం. మల్దీవులు కంటే… మనదేశంలోనూ అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పడమే. అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ కూడా ఉందని తెలియజయడమే. సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, భారతీయులు ఎక్కువగా…ఇటీవల కాలంలో మాల్దీవులు వెళ్తున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దేశ పర్యాటకులు మాల్దీవులు వెళ్లకుండా ఇండియాలోనే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని, అక్కడ పర్యటించాలని సూచించారు మోడీ. మల్దీవులు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. మన దేశం నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్లకుండా చేస్తే…ఆ ఆదాయం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. పర్యాటక రంగమూ డెవలప్ అవుతుంది.
మాల్దీవులు ప్రెసిడెంట్ గా భారత్ వ్యతిరేకి
మాల్దీవులు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ ముయిజ్జు…ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందారు. ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హమీ ఇచ్చారు. మాల్దీవుల్లో దాదాపుగా 70 మంది భారత సైనికులు…ఇండియా స్పాన్సర్ చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను పర్యవేక్షిస్తున్నారు. మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో భారత యుద్ధనౌకలు పెట్రోలింగ్కి సహాయపడుతున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పని చేసిన ఇబ్రహీం సోలీహ్… భారత అనుకూలంగా వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్…ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం ఉన్నారు. మహ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత…తమది చిన్న దేశమని, ఏ దేశంతోనూ, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా భౌగోళిక రాజకీయ శత్రుత్వంలో చిక్కుకోమని వెల్లడించారు. భారత సైనికుల ఉనికి దేశంలో ఉండకుండా భారత్ తో చర్చలు జరిపారు.
లక్షద్వీప్ అందాలు పర్యాటకుల మనసు ఆకట్టుకుంటాయి. అద్భుతమైన పగడపు దిబ్బలు, శుభ్రమైన బీచ్లు టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఎటు చూసినా ఆశ్చర్యానికి గురి చేసే అందాలే కనువిందు చేస్తాయి. అక్కడ బంగారం, అగట్టి, కద్మత్, మినీకాయ్, కల్పేని, కవరత్తి వంటి ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో విహరిస్తే స్థానిక సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుసుకోవచ్చు. లక్షద్వీప్ లో…36 ద్వీపాలున్నాయి. 1956లో ఈ దీవులని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. ఇక్కడ 36 ద్వీపాలున్నా…పదింటిలోనే ప్రజలు నివసిస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే… దేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024