Lok Sabha Polls 2024: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమి ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi on EVMs) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈలోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుస్తామని చెబుతోందని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాటిందేనని విమర్శించారు. EVMలను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లతో ఈ లోక్‌సభ ఎన్నికల్ని పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌లపై ఒత్తిడి పెంచడం, ఆటగాళ్లను కొనేయడం, గెలవకపోతే కుదరదంటూ కేప్టెన్‌లని బెదిరించడం లాంటివి జరుగుతుంటాయని ఆరోపించారు రాహుల్. లోక్‌సభ ఎన్నికలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లాంటిదేనని, ప్రధాని మోదీ అంపైర్స్‌ని ఎంపిక చేసి అందరిపైనా ఒత్తిడి తెస్తున్నారంటూ పరోక్షంగా దర్యాప్తు సంస్థలపై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల వివాదాన్ని ప్రస్తావించారు. అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయడమేంటని ప్రశ్నించారు.
మరిన్ని చూడండి