YCP strategy failed వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది


Thu 07th Nov 2024 10:14 PM

ycp  వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది


YCP strategy failed వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది

వైసీపీ కి అస్త్రం దొరికింది, ఇక కూటమి ప్రభుత్వాన్ని చెల్లాచెదురు చేద్దామని వైసీపీ నేతలు వ్యూహాలు రచించారు, మీడియా ముందుకు వచ్చి చాలా హంగామా చేసారు. ఇంకేంటి కూటమి ప్రభుత్వంలో బీటలు వారింది అంటూ పండగ చేసుకున్నారు. కానీ వైసీపీ వ్యూహం మొత్తం బెడిసికొట్టింది. వాళ్ళు కన్న కలలు చెదిరిపోయాయి. 

అసలు వైసీపీ వ్యూహం ఏమిటి, అది బెడిసి కొట్టడం ఏమిటి అంటూ తలకొట్టేసుకోకండి. అది మొన్నీమధ్యనే హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు చేతకాక చెప్పండి, హోమ్ శాఖను నా చేతుల్లోకి తీసుకుంటాను అంటూ కూటమి ప్రభుత్వంలోని మినిస్టర్ ని పవన్ విమర్శించడం చూసి అబ్బా తమకు కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఆయుధం దిరికింది అంటూ అంబటి దగ్గర నుంచి రోజా వరకు మీడియా ముందు చెలరేగిపోయారు. 

కట్ చేస్తే హోమ్ మినిస్టర్ అనిత ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ అన్న దానిలో తప్పులేదని తేల్చేసింది, పవన్ మంచిగానే చెప్పారంటూ మంత్రి నారాయణ ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు కేబినేట్ మీటింగ్ తర్వాత అనిత పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నవ్వుతూ ప్రెస్ మీట్ పెట్టింది. దానితో వైసీపీ నేతలు ఫుల్ గా డిజప్పాయింట్ అయ్యారు. 

అసలే కూటమి బీటలు వారుతుంది ఆశపడ్డ వైసీపీ నేతలకు ఇది నిజమ్ గా నీరసం తెప్పించే వార్తలే. ఏదో వ్యూహం రచించేసి ఎదురు చూస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అంతా సక్రమంగా ఉండడం చూసి అందరూ వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


YCP strategy failed:

Alliance vs YCP





Source link