Last Updated:
నెల్లూరుకు చెందిన వీరబ్రహ్మేంద్ర కుంకు బాలాజీ గో సంరక్షణపై అవగాహన కోసం పొర్లుదండాలతో తిరుమలకు వెళ్లారు. ఇది ఆయనకు 13వసారి.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎన్నో రకాలుగా తిరుమలకు చేరుకుంటారు. కొందరు కాలినడకన వెళ్తే.. మరికొందరు మొక్కులు చెల్లించుకుంటూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే నెల్లూరుకు చెందిన వీరబ్రహ్మేంద్ర కుంకు బాలాజీ మాత్రం ఓ ప్రత్యేక సందేశంతో అలిపిరి మార్గంలో పొర్లుదండాలు చేస్తూ తిరుమల బాట పట్టారు. గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆయన ఈ యాత్ర చేపట్టారు.













