తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, సెప్టెంబర్ 7 వరకు వర్ష సూచన-imd report says up to september 7th andhra pradesh telangana many districts rain forecast ,తెలంగాణ న్యూస్

రానున్న మూడ్రోజుల్లో

రానున్న మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, మహబూబాబాద్, జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Source link