నేడే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే-manabadi ts 10th class exam results today check direct links here results bse telangana gov in ,తెలంగాణ న్యూస్

పది మెమోలపై పెన్ నెంబర్

తెలంగాణ పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024 date) ఈ నెల 30న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.

పదో తరగతి ఫలితాల విడుదల అనంతరం https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు మార్కులు తెలుసుకోవచ్చు. మరోవైపు తొలిసారిగా తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్(Permanent Education Number) నెంబర్ ముద్రించనున్నారు.

ఉద్యోగార్థులకు ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్ (Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్ నెంబర్ ఆధారంగా… ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు (Telangana SSC Results 2024) మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం (ఏప్రిల్‌ 30న) ఉదయం 11 గంటలకు ఈ పరీక్షల ఫలితాల (TS 10th Results)ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Source link