Hyderabad Metro Student Pass : హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్ అమల్లోకి తీసుకొచ్చామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్‌లు జర్నీ చేయవచ్చని పేర్కొన్నారు. మెట్రో ట్రైన్ పాస్ తీసుకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. నగరంలోని 10 మెట్రో స్టేషన్‌లలో స్టూడెంట్ పాస్‌లు ఇవ్వనున్నారు. జేఎన్‌టీయూ, విక్టోరియా మెమోరియల్, నాగోల్, రాయ్‌దుర్గ్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, బేగంపేట్, పరేడ్ గ్రౌండ్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లలో స్టూడెంట్ మెట్రో పాస్‌లు ఇస్తారని అధికారులు వెల్లడించారు.