5 Family Members Swept Away at Bhushi Dam Waterfall Lonavala | Lonavala: ఘోర విషాదం, జలపాతంలో పడి కొట్టుకుపోయిన చిన్నారులు

Lonavala News: ముంబయి సమీపంలోని లోనోవాలాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భూసీ డ్యామ్ దగ్గర్లోని జలపాతం వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. వీళ్లలో ఓ మహిళ, యువతి ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1.30కి ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఒకరిని గుర్తించారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో ట్రెకింగ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు. డ్యామ్‌ వద్ద ఉండగా ప్రమాదావశాత్తు కాలు జారి ఐదుగురూ నీళ్లలో పడిపోయారని పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. 

“రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. మిగతా బాధితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. వీళ్లలో ఇద్దరు ఆరేళ్ల చిన్నారులున్నారు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయారు. భూసీ డ్యామ్ నుంచి చాలా దూరం వరకూ కొట్టుకుపోయారు. రిజర్వాయర్‌లో మునిగిపోయారు”

– పోలీసులు 

 

మరిన్ని చూడండి

Source link