High Tension at Tata Madhu Residence : తాతా మధును బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు | ACTPnews

High Tension at Tata Madhu Residence  : తాతా మధును బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు



హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టుల పర్వం తీవ్ర కలకలం రేపింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్సీ తాతా మధు, కోకాపేట నివాసంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్నానం చేస్తున్నా వినకుండా తలుపులు తెరవాలని ఒత్తిడి చేశారని, రెడీ అయి వస్తానన్నా వినకుండా తాతా మధును, షూస్ కూడా వేసుకోనివ్వకుండా నవీన్ రెడ్డిని ఈడ్చుకెళ్లారని మండిపడ్డారు. నిన్న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఉద్రిక్తతల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్పై వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టగా, బీఆర్ఎస్ నాయకులు భారీగా అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports