Last Updated:
కాలి నడకన తిరుమలకు మల్లారెడ్డి.. శ్రీవారి సన్నిధిలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రావు రమేష్ స్వామి సేవలో పాల్గొన్నారు. వీరు వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండల వాడి సన్నిధికి చేరుకుని స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ఉదయాన్నే శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించడం పట్ల వారు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.













