మౌలిక సదుపాయాల మెరుగుదల, మెరుగైన రవాణా సౌకర్యాలు, ప్రధాన ఉపాధి, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటంతో ఉప్పల్-నాగోల్ ప్రాంతం హైదరాబాద్‌లో వేగంగా ఎదుగుతున్న నివాస ప్రాంతంగా (రెసిడెన్షియల్ కారిడార్) రూపుదిద్దుకుంది. రవాణా, విద్య, ఇతర నిత్యావసర వసతులతో పాటు ఇక్కడ విస్తరిస్తున్న గృహ నిర్మాణ రంగాభివృద్ధి, అందుబాటు ధరలు, మధ్యతరగతి వర్గాల్లో మంచి కనెక్టివిటీ ఉన్న ఇళ్లను కోరుకునే ఉద్యోగులను, కుటుంబాలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతంలో ఇళ్ల డిమాండ్ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ఏబీహెచ్ఎఫ్ఎల్ కొత్త బ్రాంచ్ వినియోగదారుల అవసరాలకు తగిన గృహ రుణ పరిష్కారాలను మరింత సులభంగా అందుబాటులోకి తెస్తుంది. తద్వారా కస్టమర్లు తమ సొంతింటి కలను మరింత సౌకర్యవంతంగా సాకారం చేసుకోవడానికి దోహదపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)













