Last Updated:
తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి అవతారమెత్తి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడీ కార్డుతో దర్శనం, టికెట్లు ఇప్పిస్తానంటూ నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర వివరాలు తీసుకున్న నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి అవతారంలో భక్తులను మోసం చేస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన గోరంట్ల రూపేష్ బాబు (35)ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ టీటీడీ ఉద్యోగి ఐడీ కార్డు, రియల్మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.













