Last Updated:
ED Raids: దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం ఉదయం నుంచే భారీ స్థాయిలో మెరుపు తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, జార్ఖండ్‌తో సహా దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. కోల్‌కతాలో నమోదైన ఓ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లోని మైనింగ్ కంపెనీ వ్యవహారాలు, శ్రీసాయి కంపెనీ లావాదేవీలపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం కోల్‌కతా నుంచి ప్రత్యేక ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ AMR సంస్థల కార్యాలయాలు, నివాసాల్లోనూ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.














