Last Updated:
Cyber Fraud: సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌లు వేదికగా సైబర్ మోసగాళ్లు విసిరే సరికొత్త వలల్లో అమాయక యువత విలవిల్లాడుతోంది.
క్షణాల్లో పరిచయం పెంచుకోవడం, తియ్యని మాటలతో నమ్మించడం, ఆపై పెట్టుబడుల పేరుతో కోట్లలో ముంచేయడం కేటుగాళ్లకు నిత్యకృత్యమైంది. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి మరో విస్తుపోయే ఉదంతం వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మి, ప్రకటనల వ్యాపారం పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.3.25 కోట్లకు పైగా సమర్పించుకుని లబోదిబోమంటున్నాడు.














