Last Updated:
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించడంతో పాటు ఆ జట్టు కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రూట్ తన కెరీర్‌లో 69వ అర్ధ శతకం నమోదు చేశాడు. తద్వారా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 68 హాఫ్ సెంచరీల రికార్డ్‌ను రూట్ బద్దలు కొట్టాడు. 130 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 25వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది.














