Last Updated:
న్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సులో ప్రపంచ అగ్రనేతల మధ్య చోటుచేసుకున్న సరదా క్షణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా టీ తాగుతూ ముచ్చటించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
భారత్ ఆతిథ్యమిచ్చిన 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఘనంగా ముగిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా అనేక దేశాల అగ్రనేతలు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. సదస్సు అధికారిక చర్చలతో పాటు అగ్రనేతల మధ్య నడిచిన ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఒక అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు.














