Last Updated:
USA: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారీ ఎత్తున హెల్త్‌కేర్ మోసానికి పాల్పడి, ఏకంగా రూ.620 కోట్లు కొల్లగొట్టిన అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ నిందితుడు భాగ్యనగరంలో తలదాచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అమెరికా ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక ‘మెడికేర్’ పథకాన్ని దుర్వినియోగం చేసి నిధులు కాజేసిన భారతీయ పౌరుడు మహ్మద్ ఇబ్రహీం హైదరాబాద్‌కు చేరినట్లు యూఎస్ నిఘా వర్గాలు, పోలీసులు తెలంగాణ పోలీసులకు కీలక సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.














