Yellamma Movie: ‘ఎల్లమ్మ’ సినిమాకు హీరోయిన్‌కు ఫిక్స్.. ఎవరో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘బలగం’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వేణు యెల్దండి ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎల్లమ్మ’పై ఇప్పటికే టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.

News18
News18

‘బలగం’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వేణు యెల్దండి ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎల్లమ్మ’పై ఇప్పటికే టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ‘బలగం’ తర్వాత వేణు యెల్దండి ఎలాంటి కథను ఎంచుకున్నారు? ఈసారి ఎలాంటి సినిమాను తెరకెక్కించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ఎల్లమ్మ’ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. కోట్లాది మంది సంగీత అభిమానులను తన ట్యూన్స్‌తో అలరించిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో నటించడంతో పాటు స్వయంగా సంగీతాన్ని కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. వేణు యెల్దండి దర్శకత్వం, దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించడం, దిల్ రాజు నిర్మాణం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్ వంటి పేర్లు ఈ ప్రాజెక్ట్‌తో లింక్ అవుతూ వార్తల్లో నిలిచాయి. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్‌ను ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేకర్స్ అనంతికను కథానాయికగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.

అనంతిక సనిల్ కుమార్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి. ‘మ్యాడ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ‘8 వసంతాలు’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనలోని నటనా ప్రతిభను చూపించింది. ఇటీవల విడుదలైన ‘రొమాంచకం’ సినిమాతోనూ ప్రేక్షకులను అలరించింది. వరుసగా వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న అనంతికకు ఇప్పుడు ‘ఎల్లమ్మ’ రూపంలో మరో భారీ ప్రాజెక్ట్ దక్కినట్లు తెలుస్తోంది.

వేణు యెల్దండి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఇలాంటి ప్రతిష్టాత్మక సినిమాలో అనంతికకు అవకాశం దక్కడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. అనంతిక కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర కీలక వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ఎల్లమ్మ’కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed