తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్.. కుటుంబంతో కలిసి స్వామివారికి మొక్కులు..! Tirumala Governor Visit. | | ACTPnews

News18


Last Updated:

శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..!

+

News18

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చిన గవర్నర్‌కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి దర్శనం సందర్భంగా గవర్నర్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం నుంచి రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు గవర్నర్‌కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు గవర్నర్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం గవర్నర్‌కు స్వామివారి ప్రసాదాలను అందించారు.

కాగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి కొనసాగుతోంది. గురువారం తిరుమలకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన వాహన సేవను కూడా వీక్షించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports