Flydubai: ఫ్లైదుబాయ్ కుట్రలో ఇస్లామిక్ తీవ్రవాద కోణం.. ఇరాన్ హస్తంపై దర్యాప్తు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews

News18


Last Updated:

ఫ్లైదుబాయ్ విమానంలో దాడికి పాల్పడిన ఒమన్ కో-పైలట్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. దీని వెనుక ఇరాన్ ప్రమేయంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయని వెల్లడించారు.

News18
News18

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించిన ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నిందితుడి వ్యక్తిగత ఆధారాలు, పూర్వాపరాల పరిశీలనలో ఈ విషయం స్పష్టమైందని ఆయన తెలిపారు. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై రక్తసిక్త దాడి జరిగిన సమయంలో కో-పైలట్ సీట్లో కూర్చోకుండా, కాక్‌పిట్ మధ్యలోకి వచ్చి కంట్రోల్ ప్యానెల్ వ్యవస్థలను మొరాయించేలా జామ్ చేయడానికి ప్రయత్నించాడని వివరించారు.

ఆ సమయంలో లోపలికి చొచ్చుకొచ్చిన ఒక ఇజ్రాయెల్ ప్రయాణికుడు నిందితుడిని బలవంతంగా పక్కకు లాగాడు. అనంతరం ఇతర ప్రయాణికులు, సిబ్బంది అతడి చేతులను ఇయర్‌ఫోన్ వైర్లతో బంధించి అదుపులోకి తెచ్చారని నెతన్యాహు పేర్కొన్నారు. నేలపై పడిపోయిన ఆ దాడికోరు ‘నన్ను చంపేయండి’ అని అరిచాడని వెల్లడించారు.

ఇరాన్ ప్రమేయంపై లోతైన దర్యాప్తు

ఈ కుట్ర వెనుక ఇతర సహచరులు ఎవరైనా ఉన్నారా, అలాగే ఇరాన్ దేశ పాత్ర ఏమైనా ఉందా అనే కోణాలపై దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ జరుపుతున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు తాను కూడా చనిపోవాలనే సూసైడ్ ఆలోచనతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయన్నారు.

భారత పైలట్ సాహసంతో తప్పిన పెనుముప్పు

విమానం ఒక్కసారిగా వేగంగా కిందికి పడిపోతున్న సమయంలో లోపల భయానక వాతావరణం నెలకొందని, ప్రజలు ప్రాణభయంతో ప్రార్థనలు చేసుకున్నారని నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. దాడిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే భారత పైలట్ స్మిత్ మచ్చార్, ఇజ్రాయెల్ ప్రయాణికుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి విమానాన్ని కాపాడారని ప్రశంసించారు. ప్రస్తుతం నిందితుడిని విస్తృతంగా విచారిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed