ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధునుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనబరిచి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.. బాలయ్య.. సలీం పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఆరో చిత్రం ‘శ్రీ మద్విరాట పర్వము’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ,అర్జున, దుర్యోధన, కీచకుడు,బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు. మరోవైపు బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించడం విశేషం.













