ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ-hyderabad ap tg weather report rains in many district next two days yellow alert ,తెలంగాణ న్యూస్

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలోని రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Source link