Under Sea Society: సముద్రం కింద సొసైటీ.. అక్కడ 2BHK ఫ్లాట్ ధర ఎంత? ఎక్కడ నిర్మిస్తున్నారు? | | ACTPnews

Under Sea Society: సముద్రం కింద సొసైటీ.. అక్కడ 2BHK ఫ్లాట్ ధర ఎంత? ఎక్కడ నిర్మిస్తున్నారు? |


ఇటీవల, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి.. షార్జాలోని కల్బాలో ఒక ప్రత్యేకమైన, నీటి అడుగున.. గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు, కల్బా నగర పునర్నిర్మాణంలో భాగం. అలాగే “ఖోర్ కల్బా సిటీ” అనే భారీ ప్రాజెక్టులో ఒక కీలక భాగం. ఈ నీటి అడుగున ఉండే గృహాలు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదు. ఈ ప్రాజెక్టులోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: UMANG app benefits: ఉమంగ్ యాప్‌లో 8 అద్భుత సేవలు.. ఇవి ఉన్నాయని చాలా మందికి తెలియదు!

ఖలీజ్ టైమ్స్‌లోని ఒక రిపోర్టు ప్రకారం, ఈ నీటి అడుగున ఉన్న గృహాలు ఈ డిసెంబర్ నాటికి ప్రారంభం కావచ్చు. వీటిని పర్యాటకుల కోసం కూడా తెరవవచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన, ఉత్తేజకరమైన కొన్ని గృహాల్ని చూసే అవకాశం షార్జాకు లభిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత ఏమిటి?:

ఈ ప్రాజెక్ట్ గత ఏడేళ్లుగా నిర్మాణ దశలో ఉంది, ఇప్పుడు పనులు వేగవంతం అయ్యాయి. రాబోయే రోజుల్లో నీటి అడుగున ఇళ్ల కల నిజం కావచ్చు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, కల్బా పురావస్తు, చారిత్రక ప్రాముఖ్యాన్ని పరిరక్షిస్తూ, దానిని పర్యాటకం, వినోదం, విలాసాలకు ఒక కొత్త కేంద్రంగా మార్చడం. ఈ సముద్ర గృహాలు ఈ డిసెంబరులో ప్రారంభం కావచ్చు.

షార్జా.. డిసెంబర్‌లో కొత్త రోడ్లు, కార్నిష్ (సముద్రతీరం), పరిహార గృహాలు, అల్ హయార్ సరస్సు, వాడి అల్ హెలో రోడ్లు, అనేక ప్రధాన పర్యాటక ప్రాజెక్టులు సహా కొన్ని ఇతర ప్రాజెక్టులను ప్రారంభించబోతోంది.

ఈ ప్రాజెక్టులో నిర్మిస్తున్న మొత్తం ఇళ్ల సంఖ్యను షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి ఇంకా స్పష్టం చేయలేదు. నీటి అడుగున నిర్మించే ఇళ్లు ఎంత పెద్దవిగా ఉంటాయి? అవి 1 BHK, 2 BHK యూనిట్లుగా ఉంటాయా, లేక ఇంకా పెద్దవిగా ఉండవచ్చా? అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఇండియాలో హైదరాబాద్, ముంబై, నోయిడా లాంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వేలంలో భూముల ధరలు కూడా వందల కోట్లలో పలుకుతున్నాయి. అందువల్ల ఇక్కడి ధరలతో పోల్చితే.. షార్జాలో ఇళ్ల ధరలు ఇప్పటికే 40 శాతం తక్కువగా ఉన్నాయి. కానీ ఈ ప్రత్యేకమైన అండర్‌వాటర్ ప్రాజెక్టులో ఇళ్ల ధరలు ఎక్కువగానే ఉండొచ్చు. వీటిని సంపన్నులు.. సరదా కోసం కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. వారు వేకేషన్ ట్రిప్ కోసం వచ్చి.. ఈ సముద్రం లోపలి ఇళ్లలో కొన్ని రోజులు ఉండేందుకు ఇష్టపడవచ్చు. అలాంటి వారు కొంటే.. ఈ ఇళ్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి.

ఇవి కూడా చదవండి: Trump News: పెట్రోల్, వంట గ్యాస్ ధరలు భగ్గుమనే సంకేతాలు.. ప్రపంచ దేశాల్ని ముంచేస్తున్న ట్రంప్!

కొన్నేళ్లుగా షార్జా ప్రభుత్వం దుబాయ్ తరహాలో కల్బా తూర్పు తీరాన్ని ఆధునికీకరిస్తోంది. ఇందులో వారసత్వ సంపద పరిరక్షణ, పర్యాటక ఆకర్షణలు, మెరుగైన రహదారులు, సహజ పర్యావరణ పరిరక్షణ వంటివి ఉన్నాయి. దుబాయ్ లాగా షార్జా కూడా ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఎమిరేట్స్‌లో ఒకటిగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ నీటి అడుగున గృహ నిర్మాణ ప్రాజెక్ట్, షార్జాను మరింత ఆకర్షణీయంగా మార్చడంలో ఒక ప్రధాన ముందడుగుగా చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed