“ఇది నా జీవితంలో కచ్చితంగా సరికొత్త, ఎంతో ఉత్సాహభరితమైన అనుభూతి. నిజం చెప్పాలంటే ఈ మధుర క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో తల్లి కావాలనే బలమైన కోరిక ఉండేది. నా జీవితంలోని ఈ కొత్త ప్రయాణానికి నా సర్వస్వాన్ని అంకితం చేస్తాను” అని తన మనసులోని ఆనందాన్ని వ్యక్తపరిచారు సమంత. తాను ఎప్పుడూ ప్రతి పనిలో ఎంతో ఉద్వేగంగా, నిబద్ధతతో ఉంటానని, కానీ గర్భధారణ తర్వాత తనలో ఒక భిన్నమైన, సరికొత్త శక్తి, స్పష్టమైన లక్ష్యం కనిపిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ కొత్తగా అనిపిస్తోందని, రాబోయే భవిష్యత్తును ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నానని ఆమె తెలిపారు.














