Supritha: విజయ్ దేవరకొండకు పెళ్లైంది కాబట్టి వద్దులే.. ప్రభాస్‌ అయితే బెడ్డుపై..! సుప్రిత బోల్డ్ వీడియో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక వ్యూస్ కోసం యూట్యూబ్ టాక్ షోలు హద్దులు దాటుతున్నాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా నటి తేజస్వీ మాదివాడ హోస్ట్ చేస్తున్న ‘కాకమ్మ కథలు’ (Kakamma Kathalu) షోలో కూడా ఇదే కనిపించింది.

News18
News18

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక వ్యూస్ కోసం యూట్యూబ్ టాక్ షోలు హద్దులు దాటుతున్నాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా నటి తేజస్వీ మాదివాడ హోస్ట్ చేస్తున్న ‘కాకమ్మ కథలు’ (Kakamma Kathalu) షో కూడా ఇదే కోవలో చేరింది. ఈ షోలో గెస్ట్‌లుగా వస్తున్న వారు డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతున్నారు. వ్యూస్ కోసం షో నిర్వాహకులే ఇలాంటి స్క్రిప్ట్ రాస్తున్నారా? లేక అక్కడికి వచ్చాక సెలబ్రిటీలే కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారా? అన్నది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి సురేఖా వాణి కూతురు సుప్రీత (Supritha), అలాగే ప్రముఖ యూట్యూబర్, నటుడు నిఖిల్ (Nikhil) గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఈ ప్రోమో ఆద్యంతం అడల్ట్ కంటెంట్, బూతు పదాలతో నిండిపోయింది. వారు మాట్లాడిన మాటలకు కచ్చితంగా సెన్సార్ బీప్ వేయాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉంది.

హీరోల ఫొటోలతో వివాదాస్పద కామెంట్లు: షోలో భాగంగా హోస్ట్ తేజస్వీ.. టాలీవుడ్ స్టార్ హీరోల ఫొటోలను చూపిస్తూ గెస్ట్‌లతో ఒక రౌండ్ నిర్వహించింది. ఈ సందర్భంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫొటో చూపించగా.. సుప్రీత స్పందిస్తూ, “అతనికి పెళ్లి అయిపోయింది కదా.. వద్దులే” అని కామెంట్ చేసింది. దీనికి నిఖిల్ వంతపాడుతూ, “లేకపోతే ఏసేద్దామనే” అంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) ఫొటో చూపించగా, అతనైతే ఓకే అని సుప్రీత అనడం, దానికి తేజస్వీ ‘డైరెక్ట్ అడవేనా?’ అని డబుల్ మీనింగ్ పంచులేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శేష్‌తో తాను వెళ్తానని చెబుతూ, సుప్రీత ఒక ఫాంటసీ స్టోరీని కూడా వివరించింది.

ప్రభాస్‌పై కామెంట్స్.. ట్రోలింగ్ తప్పదా? ఇక ఈ ప్రోమోలో అందరినీ అత్యంత విస్మయానికి గురిచేసిన విషయం పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి చేసిన వ్యాఖ్యలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని తేజస్వీ ప్రభాస్ ఫొటోను చూపించగా.. “మ్యాట్రెస్ (పరుపు) మీద కూడా ఫుడ్డు పెడతాడేమో వద్దు” అంటూ సుప్రీత కొంత వెటకారంగా కామెంట్ చేసింది. ఈ మాటలకు పక్కనే ఉన్న నిఖిల్ సైతం షాక్ అవుతూ ఫేస్ పెట్టాడు. టాలీవుడ్‌లో అత్యంత గౌరవం అందుకునే ప్రభాస్ లాంటి స్టార్ హీరోపై ఇలాంటి చవకబారు కామెంట్లు చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు (Prabhas Fans) ఈ ప్రోమోపై దృష్టి సారిస్తే సుప్రీత దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఈ షోలో సుప్రీత తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. కొంత ఎమోషనల్ అయ్యింది. తన తండ్రిని కోల్పోవడం అత్యంత బాధాకరమని, తన సక్సెస్‌ను ఆయన చూడలేకపోయారని కంటతడి పెట్టుకుంది. ఏది ఏమైనా, ప్రమోషన్స్ కోసం టాక్ షోలు మరీ ఇంతలా దిగజారడంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports