Last Updated:
‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత పరశురాం పెట్లకు ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేక పోయాడంటే ఆయన కెరీర్‌లోనే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత పరశురాం పెట్లకు ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేక పోయాడంటే ఆయన కెరీర్‌లోనే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గీత గోవిందం లాంటి కల్ట్ సినిమా చేసిన విజయ్-పరశురాం కాంబో డబుల్ మ్యాజిక్ చేస్తుందనకుంటే.. టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.
ఈ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటేసింది. అయినా సరే ఆ సినిమా చూపిన ఇంపాక్ట్ ఇంకా పరశురాం పెట్లను వెంటాడుతుంది. అయితే ఇన్నేళ్లకు ఓ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా పరశురాం నందమూరి కళ్యాణ్ రామ్‌కు కథ చెప్పగా ఆయన పాజిటీవ్‌గా స్పందించాడట. బేసిక్ పాయింట్ బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని రమ్మన్నాడట. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అనీల్ రావిపూడితో కలిసి సినిమా చేస్తున్నాడు. మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకీమామతో కలిసి కళ్యాణ్ రామ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతన్నాడు.
ఇక పరశురాం పెట్ల ఫిల్మోగ్రఫిలో క్రేజీ క్రేజీ సినిమాలున్నాయి. ఈయన నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘యువత’ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత రవితేజతో ‘ఆంజనేయులు’ సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు కానీ.. రాను రాను మంచి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసి సోలో మూవీ మాత్రం పరశురాంకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆంజనేయులు సినిమా తర్వాత ఆయన వర్క్ నచ్చి రవితేజ మరోసారి పరశురాంకు ‘సారొచ్చారు’ ఛాన్స్ ఇచ్చాడు. కానీ.. ఈ సినిమా డిజాస్టర్ అయింది. పాటలు ఓ రేంజ్‌లో నచ్చేశాయి కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ సినిమా కొట్టిన దెబ్బతో 4 ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. తిరిగి అల్లు శిరీష్‌తో కలిసి శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాడు. ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాతో పరశురాం మంచి కంబ్యాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేశాడు. ఈ సినిమా పరశురాం రేంజ్‌నే మార్చేసింది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లోనే మోస్ట్ ప్రాఫిటెబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌కు ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు పరశురాం. అదే సర్కారు వారి పాట. ఈ సినిమా ఆహా, ఓహో అన్న రేంజ్‌లో హిట్టు కాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచింది. ఇక విజయ్‌తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














