Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ వాయిదా.. అసలు కారణమిదే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేడు (జూలై 24) రామాయణ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కారణాలు తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఆ వివరాలు చూస్తే..

News18
News18

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇతిహాస చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక విజువల్ వండర్‌పై దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం నేడు ‘రామాయణ’ ట్రైలర్‌ను అత్యంత భారీ ఎత్తున లాంచ్ చేయడానికి సన్నాహాలు చేసింది. అయితే, అభిమానుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ చివరి నిమిషంలో ఈ ట్రైలర్ విడుదల ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ అకస్మాత్తు వాయిదాపై చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ విడుదలను వాయిదా వేయడానికి గల ప్రధాన కారణాన్ని ఆయన వివరిస్తూ.. “భారతీయ ఇతిహాసం ‘రామాయణాన్ని’ ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు చేరువ చేయాలన్న నా చిరకాల కల ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ సంస్థ ‘సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ (Sony Pictures Entertainment) భాగస్వామ్యంతో సాకారం కాబోతోంది. ఈ చిత్రాన్ని కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా, పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్లాలని మేము నిర్ణయించాం. అందుకే గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ రిలీజ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేశాం. త్వరలోనే పక్కా ప్రణాళికతో ట్రైలర్ కొత్త రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తాం” అని నమిత్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, 100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ సినీ రంగంలో ‘రామాయణ’ ఒక గర్వకారణమైన ప్రాజెక్టుగా నిలిచిపోనుందని, హాలీవుడ్ చిత్రాల వీఎఫ్ఎక్స్ (VFX), మేకింగ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన ఇతిహాసం ప్రపంచం నలుమూలలకు వెళ్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవి పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఒదిగిపోనున్నారు. ఇక పవర్‌ఫుల్ లంకేశ్వరుడు (రావణుడు) పాత్రలో కేజీఎఫ్ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తుండటం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. దేశ సినీ చరిత్రలోనే అత్యధికంగా సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. కాగా, మొదటి భాగాన్ని ఈ ఏడాది (2026) దీపావళి కానుకగా, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ట్రైలర్ వాయిదా పడినా.. గ్లోబల్ సంస్థతో ఒప్పందం కుదరడం సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed