Last Updated:
Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసుకొని బెర్త్ కన్ఫామ్ అయిన తర్వాత రైలులో ఎక్కితే హాయిగా ప్రయాణం ముగుస్తుందనే సంతృప్తి చాలా మందికి ఉండదు.
Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసుకొని బెర్త్ కన్ఫామ్ అయిన తర్వాత రైలులో ఎక్కితే హాయిగా ప్రయాణం ముగుస్తుందనే సంతృప్తి చాలా మందికి ఉండదు. ఎందుకంటే ప్రతీ క్షణం ఎవరో ఒకరు బోగీల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరికొందరు చాయ్, బిస్కెట్, సమోసా అంటూ కూర్చొనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంటారు. అయితే ఇదంతా ప్రయాణికులకు పెద్ద సమస్య కాదు ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే కొందరు ట్రాన్స్‌జెండర్స్ రైలులోకి ఎక్కి ప్రయాణికుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఇదే అత్యంత ఇబ్బందికరంగా, అసహనాన్ని కలిగిస్తుంది. అయితే తాజాగా ఓ ట్రైన్లో ప్రయాణికుడ్ని హిజ్రా రూ.50 ఇవ్వమని డిమాండ్ చేసింది. అందుకు అతను సమాధానం చెప్పకపోవడంతో హిజ్రాకు కోపం వచ్చి అతని చెంప చెళ్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది..? ట్రైన్ ఎక్కే ప్యాసింజర్స్ ట్రాన్స్జండర్స్ కోసం ప్రత్యేకంగా కొంత డబ్బు పెట్టుకొని ప్రయాణించాలా అంటూ ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు ఈవార్త, వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది.
సాధారణంగా ప్రతీ రైలులో ప్రయాణికులకు టికెట్ కలెక్టర్ ఎంత గ్యారెంటీగా ఎదురుపడతారో అంతే సహజంగా హిజ్రాలు(ట్రాన్స్జండర్స్) కూడా తారసపడతారు. ఫ్యామిలీతో , సింగిల్‌గా కోచ్‌లలో తమకు కేటాయించిన సీట్లు, బెర్తుల్లో కూర్చుంటే .. 7-8 మంది గుంపుగా చేరిపోయి ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇదంతా కామన్‌గా జరిగేదే అని కొట్టిపారేయవద్దు. ఎందుకంటే రైలులో టికెట్ కొనుక్కొని ప్రయాణించే వారి భద్రత, రక్షణ రైల్వేశాఖపైన , రైల్వే పోలీసు వ్యవస్థపైనే ఉంటుంది.
“50 रुपया दे दे यात्री ना बोला तो थप्पड़ मार दिया 😡गलत गलत हरकत करने लगी,देखिए किन्नर लोग कैसे कर रहे हैं।
Indian Railway में ऐसे लोगों की वजह से लोग अब यात्रा नहीं करेंगे,क्योंकि एक सफर में 8,10 किन्नर लोग उठते हैं और सबको पैसा चाहिए।
मतलब इनलोगों के लिए क्या अलग सा पैसा रखना… pic.twitter.com/mWmZkbKkVS
— Subhajit Das (@SantaniSubhajit) August 3, 2026
అయితే సుభజిత్ దాస్ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూస్తే రైలులో ప్రయాణించే ప్రతీ ఒక్కరికి ఇదేం ఖర్మరా బాబు అనే విసుగు వస్తుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ట్రైన్ నంబర్, ప్రయాణికుల వివరాలు తెలియజేయలేదు కాని.. వీడియోలో మాత్రం ఓ ట్రాన్స్‌జెండర్ తన అనుచరులతో కలిసి కోచ్‌లో కూర్చున్న వారి దగ్గరకు వెళ్లింది. 50 రూపాయలు ఇవ్వమని అడిగింది. అందుకు ఓ ప్రయాణికుడు బదులివ్వకపోవడంతో హిజ్రా చేయితో అతనిపై గట్టిగా కొట్టింది. అంతటితో ఆగకుండా శరీరంపై వేసుకున్న చీరను పైకి లేపి తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా అతడిని దుర్భాషలాడింది.
రైల్లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు అంతా హిజ్రాలు వీధి రౌడీల్లా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యారు. కోచ్‌లోని మిగిలిన సీట్లలో కూర్చొన్న వాళ్లంతా ట్రాన్స్జండర్స్కి భయపడి అడగకుండానే మిగిలిన వాళ్లంతా తమ దగ్గరున్న డబ్బులో వంద, 50 రూపాయల నోట్లను వాళ్ల చేతుల్లో పెట్టారు. ఈ వీడియోలో జరిగిన తీరుపై సదరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుభజిత్ దాస్ ఈవిధంగా వ్యాఖ్యానించాడు. ట్రైన్లో ప్రయాణించే వారికి హిజ్రాల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తప్పుడు పనులు చేయడం చేయడమే కాకుండా దౌర్జన్యం చేయడం ఏమాత్రం క్షమార్హం కాదని సూచించారు.
అంతే కాదు దేశంలో అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న భారతీయ రైల్వేలో ఇలాంటి హిజ్రాల వల్ల ప్రజలు ఇక ప్రయాణించడానికి ఇష్టపడరని కామెంట్ పెట్టారు. ఎందుకంటే ఒక ప్రయాణంలోనే 8-10 మంది ట్రాన్స్జెండర్లు ఎక్కి డబ్బులు అడుగుతుంటే ప్రయాణికులు వాళ్ల కోసమే ప్రత్యేకంగా డబ్బులు పక్కన పెట్టుకోవాలా? రైల్వే శాఖ వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?అంటూ ప్రశ్నలు వేయడంతో నెటిజన్లు ఈ పోస్టుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రైలులో ప్రయాణించే వారికి హిజ్రాల చేష్టలు ఇబ్బంది కరమే కాదు.. ఆర్ధిక భారంగా మారుతున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. రైల్వే పోలీసులు, రైల్వేశాఖ అధికారులు ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని.. రైలు కోచ్‌లో ఎక్కిన ప్రయాణికుల దగ్గర డబ్బుల కోసం డిమాండ్ చేయకుండా ఉండేలా ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేయాలని .. ఉత్తర్వులు బేఖాతరు చేస్తే జరిమానా లేదంటే ఫైన్ విధించాలని కోరుతున్నారు.
Hyderabad,Telangana














