Last Updated:
Hyderabad: సమాజంలో ఉన్నతమైన గుర్తింపు, ఆడంబరాల వెనుక ఎంతటి భారీ మోసం దాగి ఉందో నిరూపించే మరో ఘటన హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది.
గతేడాది వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూను రికార్డు ధరకు దక్కించుకుని వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపి అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన ఉదంతం కలకలం రేపుతోంది. వినాయకుని ప్రసాదాన్ని పంచి, స్థానికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక నేరానికి పాల్పడిన కొండపల్లి గణేష్‌పై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EWO) పోలీసులు కేసు నమోదు చేశారు.














