Last Updated:
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది. 2011 తర్వాత భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ చైనా ద్వయం లియు షెంగ్ షు, టాన్ నింగ్ చేతిలో పోరాడి ఓటమి పాలైనా, టోర్నీలో సగర్వంగా కాంస్యంతో సరిపెట్టుకుంది. గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ సెమీస్ పోరులో భారత జోడీ 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈ యువ ద్వయానికి ఇదే తొలి పతకం కావడం విశేషం. ముఖ్యంగా 2011లో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప జోడీ లండన్‌లో కాంస్యం సాధించిన తర్వాత, మళ్లీ మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ జంట టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచి క్రీడాభిమానుల మన్ననలు పొందింది.














