Last Updated:
సామాజిక మాధ్యమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా మరో దుమారం రేపింది. భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయడం దేనికి? అంటూ ఆమె వదిలిన వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సామాజిక మాధ్యమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా, సామాజిక అంశాలపైనా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే అనసూయ, నెట్టింట తనపై జరిగే ట్రోలింగ్‌కు దీటుగా బదులిస్తుంటారు. తాజాగా భారతీయ సంప్రదాయాలు, హిందూ వితంతువులు పాటించే ఆచారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర దుమారానికి దారితీశాయి.














