ప్రచారం ప్రకారం, హౌస్‌లో అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగతంగా దూషించడం, మతం, కులం, భాష లేదా ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను ఈసారి చాలా సీరియస్‌గా తీసుకోనున్నారట. అలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ఆ మొత్తాన్ని కంటెస్టెంట్‌కు ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచే నేరుగా మినహాయించే క్లాజ్ కూడా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై షో నిర్వాహకులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.














