Chennai: వీల్‌ఛైర్‌లో స్టేషన్‌కు తెచ్చి.. వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేసి.. కన్నతల్లిని హత్య చేసిన కర్కోటకుడు! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Chennai: నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకే కర్కశంగా ప్రాణాలు తీసిన అమానవీయ ఘటన తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న 75 ఏళ్ల కన్నతల్లిని ప్రేమగా ఆసుపత్రికో లేదా బయటకో తీసుకెళ్తున్నట్లు నమ్మించి.. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి వేగంగా దూసుకొస్తున్న రైలు కిందకు తోసేసి హతమార్చాడు. ఈ కిరాతక ఘటన తిరువళ్లూరు జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా తిరువేలంగాడు సమీపంలోని మనవూరు గ్రామానికి చెందిన శేషాద్రి కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. ఆయన కొన్నేళ్ల కిందట మరణించారు. ఆయనకు భార్య పద్మావతి (75), ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులందరికీ వివాహాలు జరిగాయి. శేషాద్రి మరణానంతరం పద్మావతికి ప్రతినెలా సుమారు రూ.45 వేల వరకు ప్రభుత్వ పింఛను అందుతోంది. అయితే, వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆమె సొంతంగా నడవలేని స్థితికి చేరుకుని పూర్తిగా వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports