CM Chandrababu | బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చంద్రబాబు ముఖాముఖి | ACTPnews

CM Chandrababu | బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చంద్రబాబు ముఖాముఖి



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో పర్యటించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పెండేకల్ రిజర్వాయర్ సమీపంలో సాగవుతున్న పొలాలను పరిశీలించిన ఆయన, ప్రకృతి సేద్యం మరియు బిందు సేద్యం విధానాలపై రైతులతో చర్చించారు. స్థానిక రైతులు నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలలతో సాగునీటి అవసరాలు, పీఎండీఎస్ (PMDS) సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *