Last Updated:
ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్ సాకర్ అభిమానులకే కాదు, మాజీ అడల్ట్ స్టార్ కి జాక్ పాట్ అయింది. ఒక్క దెబ్బతో ఆమె ఆలయం ఖాతాలోకి రూ. 15 కోట్లు చేరాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్ సాకర్ అభిమానులకే కాదు, మాజీ అడల్ట్ స్టార్, ప్రస్తుత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మియా ఖలీఫా (Mia Khalifa) కు కూడా చిరకాలం గుర్తుండిపోయేలా చేసింది. న్యూజెర్సీ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో స్పెయిన్ విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి, 16 ఏళ్ల తర్వాత (2010 తర్వాత) ముచ్చటగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ చారిత్రక విజయంతో మియా ఖలీఫాకు లాటరీ తగిలినట్లయింది.
అసలు విషయం ఏమిటంటే.. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ గెలుస్తుందంటూ మియా ఖలీఫా భారీగా బెట్టింగ్ (సట్టా) వేసింది. స్పెయిన్ విజయంపై ఆమె ఏకంగా 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) పందెం కాసింది. ఆమె నమ్మకాన్ని నిజం చేస్తూ అర్జెంటీనా వంటి బలమైన జట్టును మట్టికరిపించి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించడంతో, బహుమతి కింద ఆమెకు 1.65 మిలియన్ డాలర్లు లభించాయి. భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ. 15 కోట్లకు పైనే! ఈ బెట్టింగ్ ద్వారా గెలుచుకున్న భారీ మొత్తానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
యువ సంచలనం యమాల్ జెర్సీలో సందడి:
ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మియా ఖలీఫా న్యూజెర్సీలోని స్టేడియానికి చేరుకుంది. స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ (Lamine Yamal) పేరు రాసి ఉన్న జెర్సీని ధరించి ఆమె గ్యాలరీలో సందడి చేసింది. మ్యాచ్ అనంతరం స్పెయిన్ కప్పు కొట్టిన ఆనందంలో ఆమె ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. “నా శరీరంలో ఒక్క చుక్క కూడా స్పానిష్ రక్తం లేదు, అయినా నా దేశం స్పెయిన్ విజయం సాధించడం నాకెంతో గర్వంగా ఉంది. ఇదొక భారీ విజయం, ఎంతో ఉపశమనంగా అనిపిస్తోంది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సరికొత్త ప్రయాణం:
మియా ఖలీఫా నేపథ్యం చూసుకుంటే.. మూలాలు లెబనాన్‌లో ఉన్నప్పటికీ ఆమె ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది. 2014లో అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ రంగానికి శాశ్వతంగా దూరమైంది.
ప్రస్తుతం కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 29 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు హాజరుకావడం, క్రీడలపై తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజా ప్రపంచ కప్ విజయంతో మియా చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 22, 2026 10:26 AM IST














