అయితే, 40 ఏళ్లకు చేరువవుతున్న రోహిత్ శర్మ స్థానంలో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులో సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. దీనికి తోడు గత రెండు వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ పెద్దగా రాణించకపోవడంతో, గంభీర్-రోహిత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఇచ్చిన వివరణతో రోహిత్ భవిష్యత్తుపై అభిమానుల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.














