IRCTC Flight Packages: ఫ్లైట్ టికెట్ నుంచి వసతి వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో… హైదరాబాద్ ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్స్ | బిజినెస్ | ACTPnews

IRCTC Flight Packages: ఫ్లైట్ టికెట్ నుంచి వసతి వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో... హైదరాబాద్ ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్స్ | బిజినెస్


గంగా గయ సంగం యాత్ర: ఈ ఆధ్యాత్మిక యాత్రలో గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ 6 రాత్రులు, 7 రోజుల ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది. డబుల్ షేరింగ్ ప్రాతిపదికన ఒక్కొక్కరికి ధర రూ.41,000గా నిర్ణయించారు.

ఓరియంటల్ ఒడిశా: ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని చూసేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఇందులో భువనేశ్వర్-పూరీ-కోణార్క్ ప్రాంతాల సందర్శన ఉంటుంది. 4 రాత్రులు, 5 రోజుల ఈ టూర్ 2026 సెప్టెంబర్ 26న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రూ.32,900.

అమేజింగ్ అండమాన్: దీవుల అందాలను ఆస్వాదించేందుకు ఈ ప్యాకేజీ రూపొందించారు. ఇందులో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్, బరాటాంగ్ ప్రాంతాలు ఉంటాయి. 6 రాత్రులు, 7 రోజుల ఈ టూర్ 2026 సెప్టెంబర్ 26, అక్టోబర్ 12, నవంబర్ 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కరికి ధర రూ.67,300.

చార్ ధామ్ యాత్ర: ఈ తీర్థయాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను సందర్శిస్తారు. 10 రాత్రులు, 11 రోజుల ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.68,980.

షవర్స్ ఆఫ్ సహ్యాద్రి: మహారాష్ట్ర పర్యటన కోసం రూపొందించిన ఈ ప్యాకేజీలో కొల్హాపూర్, మహాబలేశ్వర్, పుణే, భీమశంకర్ ప్రాంతాలు ఉంటాయి. 5 రాత్రులు, 6 రోజుల ఈ టూర్ 2026 సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. ధర ఒక్కొక్కరికి రూ.38,100.

రాయల్ రాజస్తాన్: రాజస్తాన్ పర్యటనలో భాగంగా ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, పుష్కర్, జైపూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 28న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.36,000.

అరుణోదయ అరుణాచల్: ఈ ఈశాన్య భారత సాహస యాత్రలో తేజ్‌పూర్, దిరాంగ్, తవాంగ్, గువాహటి ప్రాంతాలు ఉంటాయి. 7 రాత్రులు, 8 రోజుల ఈ టూర్ 2026 అక్టోబర్ 2న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.56,490.

నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా: ఈ చారిత్రక పర్యటనలో అమృత్‌సర్, చండీగఢ్, ఆగ్రా, మథుర, ఢిల్లీ ప్రాంతాలను సందర్శిస్తారు. 6 రాత్రులు, 7 రోజుల ఈ ప్యాకేజీ 2026 అక్టోబర్ 10న ప్రారంభమవుతుంది. ధర ఒక్కొక్కరికి రూ.44,600.

మిస్టికల్ కాశ్మీర్: కాశ్మీర్ అందాలను చూసేందుకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందులో గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలు ఉంటాయి. 5 రాత్రులు, 6 రోజుల ఈ టూర్ 2026 అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి ధర రూ.39,070.

గ్లోరీ ఆఫ్ గుజరాత్: ఈ గుజరాత్ పర్యటనలో అహ్మదాబాద్, భావ్‌నగర్, డయ్యూ, సోమనాథ్, ద్వారక, పటాన్ ప్రాంతాలను సందర్శిస్తారు. 7 రాత్రులు, 8 రోజుల ఈ ప్యాకేజీ 2026 అక్టోబర్ 24న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.40,600.

సౌత్ ఇండియా టెంపుల్ రన్: దక్షిణ భారత ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలను చూడాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఇందులో తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చి ప్రాంతాలు ఉంటాయి. 6 రాత్రులు, 7 రోజుల ఈ టూర్ 2026 అక్టోబర్ 24న ప్రారంభమవుతుంది. ధర ఒక్కొక్కరికి రూ.44,800.

మెస్మరైజింగ్ మేఘాలయ & అసోం: ఈశాన్య భారత పర్యటనలో భాగంగా చిరాపుంజీ, గువాహటి, షిల్లాంగ్ ప్రాంతాలను సందర్శిస్తారు. 6 రాత్రులు, 7 రోజుల ఈ ప్యాకేజీ 2026 అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.53,000.

మధ్యప్రదేశ్ మహా దర్శన్: ఈ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ ప్రాంతాలు ఉంటాయి. 4 రాత్రులు, 5 రోజుల ఈ టూర్ 2026 నవంబర్ 18న నిర్వహించనున్నారు. ప్యాకేజీ ధర ఇంకా నిర్ణయించలేదు.

కల్చరల్ కేరళ: డిసెంబర్ సెలవుల కోసం రూపొందించిన ఈ ప్యాకేజీలో కొచ్చి, మున్నార్, తెక్కడి, కుమరకోమ్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించవచ్చు. 6 రాత్రులు, 7 రోజుల ఈ టూర్ 2026 డిసెంబర్ 6న ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ధర రూ.45,900.

ఇది కూడా చదవండి: Railways: రైలు ఎక్కిన యువతికి ఊహించని సర్‌ప్రైజ్… ఏం జరిగిందంటే?

ఐఆర్‌సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్యాకేజీల ధరలు ఒక్కొక్క ప్రయాణికుడికి డబుల్ షేరింగ్ ప్రాతిపదికన వర్తిస్తాయి. ప్యాకేజీల పూర్తి వివరాలు, అందులో ఉండే సదుపాయాలు, నిబంధనలు, తాజా ధరల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను చూడవచ్చని తెలిపింది. బుకింగ్‌లు, ఇతర వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్‌ను సంప్రదించవచ్చు.

ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్,

1వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా,

ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ

040-27702407 / 9701360701, 9281030740

tourismscz@irctc.com

దేశంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేసే ఈ కొత్త ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు హైదరాబాద్ నుంచి ప్రయాణించే వారికి సులభమైన ఎంపికగా మారనున్నాయి. విమాన సౌకర్యం, మార్గదర్శక టూర్ సేవలు, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకే ప్యాకేజీలో ఉండటం వల్ల ప్రయాణికులు ప్రశాంతంగా సెలవులను ఆస్వాదించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed