విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం బాధితులను పరామర్శించారు. విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను కలిసి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు వెళ్లిన పవన్.. ప్రమాదంపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, ఇది అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.
Source link
Pawan Kalyan on Vizag Steel Blast | ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగలేదు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










