Last Updated:
దేశంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని వెల్లడించింది.
దేశంలో నేడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) తాజా సర్వేలో తేలింది. 2024 లోక్సభ ఎన్నికల కంటే ఎన్డీఏ కూటమి తన బలాన్ని మరింత పెంచుకుంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆగస్టు 2026 నాటి పరిస్థితుల ఆధారంగా చేసిన ఈ అధ్యయనంలో.. బీజేపీ సొంతంగా 261 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇది తాజా ఎన్నికల్లో వచ్చిన 240 సీట్ల కంటే చాలా ఎక్కువ.














