Last Updated:
PM Narendra Modi: ప్రధాని మోదీ ఈమధ్య తనలో ఒక మైనస్ పాయింట్‌ని కనిపెట్టారు. తాను జెన్ జీకి దూరం అయ్యానని గ్రహించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతీ ప్లాన్.. జెన్ జీకి దగ్గరయ్యేలా సాగుతోంది. నెక్ట్స్ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగస్టు 7) ఎన్డీయే కూటమికి చెందిన సుమారు 45 మంది కొత్తగా ఎన్నికైన, తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్న ఎంపీలతో తన ఇంట్లో ఉదయం 9 గంటలకు అల్పాహార విందులో భేటీ కానున్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్టు ప్రకారం, ఈ ప్రత్యేక సమావేశంలో ఇటీవల ఇతర పార్టీల నుంచి ఎన్డీయే పార్టీలలోకి మారిన ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి NCPI లోకి, అలాగే ఉద్ధవ్ వర్గం (UBT) నుంచి శివసేన (షిండే వర్గం) లోకి మారిన ఎంపీలు ఈ సమావేశంలో భాగం కానున్నారని ఏఎన్ఐ తెలిపింది.














