Last Updated:
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితుల అంతులేని ధైర్యసాహసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. బుధవారం నాటి ‘విభజన విభిషిక స్మృతి దివస్’ సందర్భంగా వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా ‘విభజన విభిషిక స్మృతి దివస్’ (Vibhajan Vibhishika Smriti Diwas) పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విభజన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, వారి అద్భుతమైన పోరాట పటిమను ఆయన కొనియాడారు. చారిత్రక విభజన ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘోర విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు అర్థాంతరంగా నిరాశ్రయులయ్యాయని, తమ ఆత్మీయులను కోల్పోయి తీవ్ర వేదన అనుభవించారని ఆయన గుర్తుచేశారు.














