Last Updated:
Punjab: కన్నప్రేమను మంటగలిపి, రక్తసంబంధాన్ని కాలరాసిన అత్యంత దారుణమైన ఉదంతం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. 19 ఏళ్ల కూతురి ప్రవర్తనపై అనుమానం పెంచుకుని అతి కిరాతకంగా ఆమెను హతమార్చాడు. అంతటితో ఆగకుండా చేసిన ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలోనే గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. భర్త మాటలపై అనుమానం వచ్చిన కన్నతల్లి పోలీసులను ఆశ్రయించి, జేసీబీతో తవ్వించడంతో ఆ ఘోర రహస్యం బయటపడింది. అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతంలోని మత్తేవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.














