ByKranthi
Sat 01st Jul 2023 09:06 PM
సమంత ఈమధ్యన గ్లామర్ విషయంలో స్టయిల్ మార్చింది. అందాలు చూపించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే ఆ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. బాలీవుడ్‌లో కాలు పెట్టగానే సమంత స్టయిల్ మొత్తం ఛేంజ్ చేసేసింది. మొదటినుండి గ్లామర్ డాల్‌గానే కనిపించినా.. ప్రస్తుతం ఆమె చూపిస్తున్న గ్లామర్ డోస్ మరింతగా ఎక్కువైంది. ఫ్యామిలీ మేన్‌లో బోల్డ్ సీన్స్‌లో ఇరగదీసిన సమంత.. చైతూతో విడాకుల తర్వాత గ్లామర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
విజయ్ దేవరకొండతో ఖుషి మూవీతో పాటుగా సిటాడెల్ వెబ్ సీరీస్ కోసం ఈ మధ్యనే సెర్బియా వెళ్ళి వచ్చింది. అక్కడ సెర్బియా వీధుల్లో చక్కర్లు కొట్టింది. అక్కడ కూడా ఫుల్‌గా గ్లామర్ షో చేస్తూ.. కలియదిరిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రీసెంట్‌గానే సిటాడెల్ వెబ్ సిరీస్ సెర్బియా షెడ్యూల్ పూర్తయింది. ఇక తన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేస్తోంది. అలా అందాలతో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.
దీంతో సమంత పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. డీప్ నెక్ టాప్‌లో సమంత అందాలు కనిపించేలా వేసిన అవుట్ ఫిట్ ఇప్పుడు వైరల్‌గా మరింది. ఈ పిక్ చూశాక సమంత ఏమిటీ వింత.. మరి ఇంతలా ఎక్స్‌పోజింగ్ అవసరమా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha Glamour Pic Goes Viral:
Samantha Glamour Treat Taggede le