Last Updated:
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ రాజధాని హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ, అలాగే అర్హులైన యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో భారతీయ జనతా పార్టీ (BJP) అసెంబ్లీ వేదికగా పోరుబాట పట్టింది. ఈ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభలో చర్చించేందుకు బీజేపీ శాసనసభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.














